రెబల్ స్టార్ ప్రభాస్ తో అత్యంత భారీ బడ్జెట్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.ప్రభాస్ ఈ మూవీలో శ్రీమహావిష్ణువు 10వ అవతారం అయిన కల్కిగా కనిపించబోతున్నాడు. అలాగే కమల్ హాసన్, అమితాబచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని లాంటి స్టార్స్ ఈ మూవీలో కీలక పాత్రలలో నటిస్తున్నారు.ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీగా ఇది సిద్ధం అవుతోంది. ఈ మూవీలో నాగ్ అశ్విన్ సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకి చూపించబోతున్నాడు. ఇదిలా ఉంటే మే 9న ఈ చిత్రం రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు. అయితే ఎన్నికలు హడావిడి ఉండటంతో సినిమా కలెక్షన్స్ పై ప్రభావం ఉంటుందని రిలీజ్ వాయిదా వేశారు. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ పై నిర్మాత, డిస్టిబ్యూటర్స్ చర్చిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. భారీ బడ్జెట్ మూవీ కావడంతో మూవీ థీయాట్రికల్ రైట్స్ కూడా ఎక్కువ ధరలకే నిర్మాత అమ్మేస్తున్నట్లు తెలుస్తోంది.


ఈ నేపథ్యంలో కల్కి 2898ఏడీ కోసం అంతర్జాతీయ స్థాయిలో వేరే ఏ ఇతర సినిమాతో కూడా పోటీ లేని డేట్ ని ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే చిత్ర యూనిట్ రెండు అప్షన్స్ పెట్టుకుందని టాక్ వినిపిస్తోంది. మే 30, జూన్ 20 డేట్స్ లలో ఒకటి నిర్ణయించాలని టీం అనుకుంటున్నారట. ముందుగా మే 30కి రిలీజ్ బాగుంటుందని అనుకున్న కూడా జూన్ 20 అయితే సోలో రిలీజ్ గా ఉంటుందని నిర్ణయం మార్చుకున్నట్లు టాక్. కల్కి లాంటి భారీ బడ్జెట్ సినిమాలకి హాలీవుడ్ లెవల్ లో కూడా ఎలాంటి పోటీ ఉండకూడదు. జూన్ 20న ఇంటర్నేషనల్ లెవల్ లో పెద్ద సినిమాలేవీ రిలీజ్ లు లేవు. ప్రపంచ వ్యాప్తంగా కల్కి 2898ఏడీ మూవీ 22 భాషలలో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో వరల్డ్ వైడ్ గా సత్తా చాటాలంటే జూన్ 20 బెస్ట్ డేట్ అని అనుకుంటున్నారట.ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ సలార్ 2 సినిమా మే లో స్టార్ట్ అయ్యిద్దట. ఈ సినిమాని 2025 సమ్మర్లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక రాజా సాబ్ సినిమా మేజర్ పార్ట్ పూర్తయ్యిందట. ఈ మూవీని 2025 సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: