సీనియర్ నటి ప్రియమణి గురించి ప్రత్యేక పరిచయము అవసరం లేదు. తన అందం అభినయంతో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు ఎందరో అభిమానులు ఉన్నారు. హీరోయిన్గా రాణించిన ప్రియమణి ఇప్పుడు కీలక పాత్రలో కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకు తెలుగులోనే సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చింది. షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది ఈ చిన్నది. దాదాపుగా 21 ఏళ్లు గా సిని ఇండస్ట్రీలో కొనసాగుతోంది ఈ ముద్దుగుమ్మ.  తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ హిందీ మలయాళ భాషల్లో కూడా వరుస సినిమాలు చేసి అక్కడ కూడా

మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే తాజాగా ఈమె చేసిన పలు కామెంట్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేంటంటే నార్త్ సౌత్ సినిమాలు రెండు ఒకేలా ఉండవు అని చెప్పకు వచ్చింది ప్రియమణి. దాంతోపాటు మన ఇండస్ట్రీపై ప్రశంసల వర్షం కురిపించింది. అలా ప్రియమణి చేసిన ఈ కామెంట్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి  అయితే చాలా రోజుల నుండి సౌత్ హిందీ అని చర్చి జరుగుతోంది అని దీని గురించి చాలామంది స్పందించారు అని బాలీవుడ్ జనాలు మేము గ్రేట్ అంటారు. సౌత్ వాళ్ళు మేము గ్రేట్ అంటారు అంటూ ఈ సందర్భంగా వెల్లడించింది.

కానీ మరికొందరు మాత్రం రెండు పరిశ్రమలు ఒక్కటే అని అంటున్నారు  అయితే ప్రియమణి ఓకే ఇండస్ట్రీలో కాకుండా రెండు ఇండస్ట్రీలో సినిమాలు చేసింది. ఆ అనుభవం తనకి ఉంది. కాబట్టి ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ.. బాలీవుడ్ లో ఆర్టిస్ట్ ల ఎంపిక డిఫరెంట్ గా ఉంటుంది. హిందీలో కాస్టింగ్ డైరెక్టర్ ఉంటాడు. అతను మిమ్మల్ని పిలుస్తారు. వారు ఓకే చేసిన తర్వాత టీమ్‌తో మాట్లాడుతారు. కానీ, మన దగ్గర అలా కాదు. అక్కడ మీకు నిర్మాత లేదా దర్శకుడి నుండి నేరుగా కాల్ వస్తుంది. బాలీవుడ్‌లో కాస్టింగ్ డైరెక్టర్ల నిర్ణయమే ఫైనల్'' అని ప్రియమణి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: