జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న సినిమా దేవర. ఇక నందమూరి అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ డీజే స్క్వేర్ సినిమా సక్సెస్ అవడంతో సక్సెస్ మీట్ లో కనిపించారు. ఇందులో భాగంగానే దేవర సినిమా గురించి అప్డేట్ కూడా ఇచ్చాడు. దేవర సినిమాకి ఎంత డిమాండ్ ఉందో ఆయనే స్వయంగా తెలియజేశారు. కాగా దేవర సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14 విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాలవల్ల ఆలస్యం అవుతూ పోస్ట్ పోన్ అవుతుంది.

కానీ ఈసారైనా కచ్చితంగా అనుకున్న తేదీకి విడుదల చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తి కావస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తిగాకముందే జూనియర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా షూటింగ్ లైన్ లో పెట్టాడు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ తన మొదటి సినిమా గా బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోగా హృతిక్ రోషన్ నటిస్తున్నాడు.

మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇందులో సెకండ్ హీరోగా నటిస్తాడా లేదా కీలక పాత్రలో ఏమైనా కనిపిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. యష్ రాజ్ ఫిలిమ్స్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వార్ 2 తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపిస్తారని సమాచారం. ఈ సిరీస్ లో సల్మాన్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్, టైగర్ ష్రాఫ్ ఇప్పటికే భాగమయ్యారు. తాజాగా ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ కి అయాన్ ముఖర్జీ దర్శకుడు. కాగా వార్ 2 లేటెస్ట్ షెడ్యూల్ ముంబైలో జరుగుతుంది. యష్ రాజ్ ఫిలిమ్స్ స్టూడియోలో పది రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ నందు ఎన్టీఆర్ జాయిన్ అయ్యారు. ముంబైకి వెళ్లిన ఎన్టీఆర్ అక్కడే మకాం వేశాడు. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: