ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప టు సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదలై ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ మధ్యే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ సైతం విడుదల చేశారు. ఈ టీజర్ లో అల్లు అర్జున్ మాతంగి వేషంలో ఒక పట్టు చీర కట్టుకుని చాలా ఇంట్రెస్టింగ్ లుక్ లో కనిపించాడు. అయితే ఇది సినిమాలోనే ఒక జాతర అని తెలుస్తోంది. అయితే కేవలం ఈ సీన్ కోసమే చిత్ర బృందం దాదాపుగా 60 కోట్లకు పైగా ఖర్చు చేశారు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప టు సినిమాలో గంగమ్మ తల్లి జాతర సీను ఉంటుందట. అయితే ఈ సీన్ కేవలం ఆరు నిమిషాలు మాత్రమే ఉంటుంది. కానీ ఈ సీన్ మొత్తం సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది అని అంటున్నారు. అందుకే ఈ సీన్ కోసం ఏకంగా 60 కోట్లకు పైగానే ఖర్చు చేశారట చిత్రబంధం. అంతే కాదు కేవలం ఆ ఆరు నిమిషాల సీన్ కోసం దాదాపుగా 30 రోజులపాటు షూటింగ్ జరిపినట్లుగా తెలుస్తోంది. అలా ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు చేసి తీసిన సీన్ ను టీజర్ లాగా విడుదల చేశారు. అయితే గతంలో వచ్చిన ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ ఎలా కనిపించాడో ఇప్పుడు టీజర్ లో కూడా అలాగే కనిపించాడు.

పదేపదే ఇది సీన్ అదే ఫోటోను విడుదల చేస్తున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ సీన్ సినిమాకి ఎంత హైలెట్ అని.. అందుకే మేకర్స్ కూడా ఏమాత్రం రాజీ పడకుండా భారీ ఖర్చుతో ఈ సీన్ తీశారు. అయితే ఈ సీన్ కు ఇంత ఖర్చు నిజంగానే పెట్టారా అని హిందుస్థాన్ టైమ్స్ ఆరా తీయడానికి ప్రయత్నించినా.. మూవీ వర్గాలు మాత్రం దీనిని ఖండించలేదు. అలాగని ధృవీకరించలేదు. "జాతర సీన్ తీయడం కోసం భారీ బడ్జెట్ తో రూపొందించిన సెట్ అవసరమైందన్నది మాత్రం నేను చెప్పగలను. స్టోరీలో కీలకమైన సీన్ కావడంతో మేకర్స్ చాలా శ్రమించారు. అల్లు అర్జున్ తీవ్రమైన వెన్ను నొప్పితోనూ బాధపడినా.. సీన్ పూర్తి చేయగలిగాడు" అని సదరు వర్గాలు వెల్లడించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: