మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక బ్రాండ్ ని ఏర్పరచుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి మెప్పించిన రామ్ చరణ్ rrr చిత్రంతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. తన నటనతో హాలీవుడ్ మేకర్స్ ను కూడా ఆకట్టుకున్నారు రామ్ చరణ్. ఈ సినిమాతో ఎన్నో అవార్డులను రివార్డులను కూడా అందుకున్నారు. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నట్టుగా తెలుస్తోంది. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.


అసలు విషయంలోకి వెళ్తే చెన్నైలోని యూనివర్సిటీ ఆఫ్ వెల్స్ కాన్వకేషన్ వేదికగా రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ అందించబోతున్నారు. ఏప్రిల్ 13వ తేదీన స్పెషల్ డే సందర్భంగా ముఖ్యఅతిథిగా రామ్ చరణ్ రాబోతున్నారట. సినీ పరిశ్రమలో అద్భుతమైన సేవలు అందించినందుకు గాను వెల్త్ యూనివర్సిటీ రామ్ చరణ్ కి డాక్టరేట్ అందించబోతోంది. ఈ ఏడాది ఈ వేడుకలకు సినీ నిర్మాత యూనివర్సిటీ ఛాన్స్ లర్ గా ఈసారి గణేష్ నిర్వహించబోతున్నారు. రామ్ చరణ్ అద్భుతమైన నటనతో ఎంతోమంది ప్రజలను కూడా ఆకట్టుకున్నారు.


తన కెరియర్ చిరుత సినిమాతో మొదలై ఇప్పటికి హాలీవుడ్ స్థాయికి చేరుకున్నారు రామ్ చరణ్..గత ఏడాది వెల్స్ యూనివర్సిటీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ డైరెక్టర్ శంకర్కు ఇలాంటి డాక్టరేట్  ను సైతం అందుకున్నారు. మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ కు మాత్రమే ఇలాంటి గౌరవం లభిస్తోంది. దీంతో మెగా అభిమానుల సైతం రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా రాబోతోంది. మొదటిసారి రాజకీయ నాయకుడిగా రామ్ చరణ్ కనిపించబోతున్నారు. ఏడాది సెప్టెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబుతో మరొక సినిమాని చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: