టాలీవుడ్ లో అక్కినేని అఖిల్ గత ఏడాది నటించిన ఏజెంట్ సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ నెలలో విడుదలైంది ..ఏజెంట్ సినిమా భారీ ఫ్లాప్ ను అందుకుంది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అఖిల్ దాదాపుగా రెండేళ్లపాటు ఈ సినిమా కోసం కష్టపడినప్పటికీ అదంతా వృధా అయిపోయింది. దీంతో అభిమానులు కూడా డైరెక్టర్ పైన చాలా ఫైర్ అయ్యారు. దీంతో అఖిల్ తన తదుపరి సినిమా కోసం చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏడాది పూర్తి అవుతున్న తన తదుపరిచిత్రాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు.


తన పుట్టినరోజు సందర్భంగా ఏదైనా సినిమా అప్డేట్ వస్తుందని అభిమానులు అనుకున్నప్పటికీ ఎక్కడా రాలేదు.తాజాగా ఇప్పుడు ఎయిర్ పోర్ట్ లో అఖిల్ కొత్తలోకి చూసి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.. అఖిల్ తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల నుంచి తన పుట్టినరోజు వేడుకలు చేసుకుని హైదరాబాద్ కు చేరుకున్నారు.. ఎయిర్పోర్ట్లో కనిపించిన అఖిల్ పొడవాటి జుట్టుతో భారీ గడ్డంతో సరికొత్త లుక్కులు కనిపించారు. అయితే ఈ లుక్ అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటివరకు అఖిల్ ఇలాంటి లుక్ లో ఎప్పుడూ కనిపించలేదు.


అయితే త్వరలోనే అఖిల్ ఒక భారీ బడ్జెట్ పీరియాడికల్ సినిమాలో నటించడానికి ఇలా తయారయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ కుమార్ దర్శకత్వం వహించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.UV బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలుపడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రాజెక్టును గత ఏడాది ప్రారంభించాలనుకున్నప్పటికీ కొన్ని కారణాల చేత వాయిదా పడింది.. అయితే ఈ సినిమా కథని ఫైనల్ డ్రాఫ్ట్ చేసే విధంగా అనిల్ కుమార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రధాన నటీనటులు సాంకేతిక నిప్పులను కూడా సెలెక్ట్ చేసే పనిలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: