ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమలో సినిమా బడ్జెట్లో ఆకాశన్నంటుతూ ఉన్నాయి  ఒకప్పుడు 100 కోట్ల పెట్టుబడితో సినిమా తీస్తేనే ఇక అంతకంటే పెద్ద సినిమా మరొకటి ఉండదు అని అనుకునేవారు. కానీ ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్ పెడితే అది ఒక సాదాసీదా సినిమా గానే ఉంది. వేలకోట్ల బడ్జెట్ పెడితేనే దానిని పెద్ద సినిమా అని అందరూ మాట్లాడుకోవడం చేస్తూ ఉన్నారు. అయితే కేవలం సినిమా బడ్జెట్ పెరిగిపోవడమే కాదు అటు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారి.. రెమ్యూనరేషన్లు  కూడా అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇంకోవైపు ఇండియన్ సినిమా మార్కెట్ కూడా అంతకంతకు విస్తరిస్తుంది. ఓటీటి ఫ్లాట్ ఫారంల పెరుగుదల మార్కెట్ విస్తరణకు ప్రధాన కారణంగా మారిపోయింది అని చెప్పాలి. ఒకప్పుడు పాతిక కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటేనే వామ్మో అనుకునేవారు ప్రేక్షకులు. కానీ ఇటీవల కాలంలో ఎంతోమంది నటీనటులు 100 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారు.  దీంతో ప్రస్తుతం ఇండియన్స్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో ఎవరు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ప్రస్తుతం అటు సౌత్ ఇండస్ట్రీలో ప్రభాస్ బాలీవుడ్లో షారుక్ ఖాన్ లు మిగతా హీరోలతో పోల్చి చూస్తే అత్యధిక పారితోషకం  తీసుకుంటున్నారు.


 అయితే వీరిద్దరిని మించి మరో నటుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషకం పుచ్చుకుంటున్నాడు. ఆయన మరువరో కాదు ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్. ఏకంగా 250 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా  ఆయనకు అంతట అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు 73 ఏళ్లు ఇప్పటికీ హీరోగా రాణిస్తున్నారు  అయితే గత ఏడాది రజినీకాంత్ నటించిన జైలర్ సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి 600 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ విజయంతో రజిని తన పారితోషకాన్ని  పెంచేసారట. ఇప్పుడు లోకేష్ కనకరాజు తో తీస్తున్న సినిమాకు 250 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారట రజిని.

మరింత సమాచారం తెలుసుకోండి: