టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా "నా సామి రంగ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమాకి ప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ఆశగా రంగనాథ్ , నాగార్జున కు జోడిగా నటించింది. అల్లరి నరేష్ , రాజ్ తరుణ్మూవీ లో కీలకమైన పాత్రలలో నటించగా ... ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఇకపోతే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా ఆ తర్వాత డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చి "ఓ టి టి" ప్రేక్షకులను కూడా భాగానే ఆకట్టుకుంది. ఇలా ధియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం అయ్యింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను "స్టార్ మా" సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ సంస్థ వారు ప్రచారం చేయగా మొదటి సారి ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 8.08 "టి ఆర్ పి" రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ కి మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు మంచి "టీ ఆర్ పి" రేటింగ్ దక్కింది అని చెప్పవచ్చు. ఈ విధంగా ఈ సినిమా ధియేటర్ "ఓ టి టి" ప్రేక్షకులను మాత్రమే కాకుండా బుల్లి తెర ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: