ఇప్పటివరకు విడుదల అయిన ఇండియన్ సినిమాలలోని టీజర్ లలో రిలీజ్ అయిన 24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 5 టీజర్ లు ఏవో తెలుసుకుందాం.

యాశ్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన "కే జి ఎఫ్ చాప్టర్ 2"  మూవీ టీజర్ విడుదల 24 గంటల సమయంలో 4.68 మిలియన్ లైక్స్ ను దక్కించుకుంది.

కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ కొంత కాలం క్రితం మాస్టర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మాళవిక మోహన్ హీరోయిన్ గా నటించగా ... లోకేష్ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ టీజర్ కి విడుదల అయిన 24 గంటల్లో 1.85 మిలియన్ లైక్స్ లభించాయి.

ప్రభాస్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 1.672 లైక్స్ లభించాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ యొక్క టీజర్ నీ కొన్ని రోజుల క్రితం విడుదల చేయగా ఈ టీజర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 1.25 మిలియన్ లైక్స్ లభించాయి. ఈ మూవీ.ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు.

తలపతి విజయ్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన సర్కార్ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 1.2 మిలియన్ లైక్స్ లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: