టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా రాకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాదులో ఒక కొత్త బిజినెస్ నో స్టార్ట్ చేయబోతోంది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే ఆమెకు హైదరాబాదులో ఎఫ్ 45 పేరుతో ఒక  జిమ్ ఉన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా మంది స్టార్ సెలబ్రెటీలు ఈ జిమ్ కి వస్తూ ఉంటారు. అవే కాకుండా వెల్ బీయింగ్ న్యూట్రిషన్ వెల్నెస్ న్యూట్రిషన్ హెల్త్ అండ్ స్కిన్ సంస్థల్లో కూడా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.

 ఇందులో భాగంగానే ఇప్పుడు మరొక కొత్త బిజినెస్ ను స్టార్ట్ చేయబోతున్నారట రకుల్ ప్రీత్ సింగ్. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.. మిల్లెట్లతో పేరుతో ఒక రెస్టారెంట్ ను రకుల్ ప్రీత్ సింగ్ ఓపెన్ చేయబోతున్నారు అని తెలుస్తోంది. మాదాపూర్ క్యూర్ ఫుడ్స్ తో కలిసి ఈ రెస్టారెంట్ ను ఓపెన్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు పూర్తిగా చిరుధాన్యాలతో కూడిన ఆరోగ్యకరమైన వంటలు మాత్రమే ఈ రెస్టారెంట్లో లభించినుట్లుగా తెలుస్తోంది. అయితే ఈ రెస్టారెంట్ ను ఏప్రిల్ 16న గ్రాండ్గా ఓపెన్ చేయనున్నారు. ప్రస్తుతం ఫుడ్ బిజినెస్ కి ఉన్న డిమాండ్

ఎంతో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే రకుల్ ప్రీత్ సింగ్ సైతం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ఆమె తమిళ హీరో శివ కార్తికేయన్ తో చేసిన అయలాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైన్స్ ఫిక్షన్ కథాంశం తో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తరువాత స్టార్ డైరెక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబోలో వస్తున్న భారతీయుడు 2లో కూడా కీ రోల్ చేస్తున్నారు రకుల్ ప్రీత్. భారీ అంచనాలున్న ఈ సినిమా జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఆమె బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని ని పెళ్లిచేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: