టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి జోష్ మీద కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సిద్దు జొన్నలగడ్డ తాజాగా టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా మార్చి 29 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి సూపర్ సాలిడ్ పాసిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ ఇప్పటికే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లను వరల్డ్ వైడ్ గా వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా సిద్దు కెరియర్ లోనే ఆల్ టైం హిట్ గా నిలిచింది.

మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ బ్యూటీ ఈ సినిమాలో తన నటనతో మాత్రమే కాకుండా అందాలతో కూడా ప్రేక్షకులను కట్టి పడేసింది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో డి జె టిల్లు మూవీ లో హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి ముఖ్యమైన పాత్రలో నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ కేజీ న్యూస్ వైరల్ అవుతుంది.

మూవీ యొక్క శాటిలైట్ హక్కులను "స్టార్ మా" సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు ... అందులో భాగంగా ఇంకా కొన్ని రోజుల ధియేటర్ రను పూర్తి అయిన తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ... ఆ తర్వాత కొన్ని వారాలు ముగిసాక ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా "స్టార్ మా" చానల్లో ప్రసారం కానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే వంద కోట్లకు పైగా కలెక్షన్ లను వసూలు చేసిన ఈ మూవీ ఇప్పటికీ కూడా అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: