టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఈ శర్వానంద్ సినిమా వచ్చి దాదాపుగా రెండేళ్లు కావస్తోంది. 2022 సెప్టెంబర్ లో ఒకే ఒక జీవితం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆయన నటించిన ఒక్క సినిమా కూడా విడుదల అవలేదు. అలాగని ఏడాదికి కనీసం ఒక్క సినిమాతో ఆయన వస్తాడా అంటే అది కూడా లేదు. కొన్ని వ్యక్తిగత కారణాలు ఇతర కారణాలవల్ల సినిమాలు చేయడం లేదు శర్వానంద్. అయితే సినిమాలకి గ్యాప్ ఎక్కువగా ఇచ్చాను అని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం వరుసగా ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు శర్వానంద్ .

దీంతో శర్వానంద్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. అయితే ఈ శర్వానంద్ కెరియర్ ముందు నుండే కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఆయన నటించిన ఒక్క సినిమా హిట్ అయితే ఆ తర్వాత సినిమాలో వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. బ్లాక్ బస్టర్ ని అందుకున్న కూడా ఆ తర్వాత వెంటనే డిజాస్టర్ లు అవుతున్నాయి. అలా ఒకే ఒక జీవితం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు శర్వానంద్. ఇప్పుడు మనమే అనే మరొక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు దర్శక నిర్మాతలు.

 ఈ సినిమా తర్వాత 'లూజర్' వెబ్‌ సిరీస్ దర్శకుడు అభిలాష్ రెడ్డితో ఓ సినిమా ఓకే చేశాడు. అలాగే శ్రీవిష్ణుకు 'సామజవరగమన'తో మంచి విజయం అందించిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మరో సినిమా ఓకే చేశాడు. ఇలా మూడు సినిమాలు సెట్స్‌ మీద ఉండగానే మరో సినిమాను ఓకే చేశాడు అని లేటెస్ట్‌ టాక్‌. 'ఘాజి' సినిమాతో నేషనల్‌ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్‌ రెడ్డి  దర్శకత్వంలో ఓ సినిమా శర్వ చేస్తాడట.  అలా వరుసగా నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టాడు శర్వానంద్ మరి ఈ సినిమాల్లో ఏ సినిమా మంచి విజయాన్ని ఎందుకు ఉంటుందో చూడాలి మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: