ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా వార్ 2. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఇందులో భాగంగానే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ముంబై కి వెళ్ళాడు. అయితే  ఇన్నాళ్లు మాస్ రగడ్ లుక్ లో కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన లుక్కును పూర్తిగా మార్చేశాడు. క్లీన్ షేవింగ్ ఆర్మీ హెయిర్ స్టైల్ లో దర్శనమిచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు అన్న ప్రచారం జరుగుతుంది. కానీ ఈ వార్తల్లో మాత్రం ఇంతవరకు నిజం ఉంది అన్నది మాత్రం తెలీదు.

అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లుక్కు చూస్తుంటే నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది. కాగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా YRF స్పై యూనివర్స్ సినిమా కోసం ముంబైకి వస్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లుక్ రివిల్ ఐ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా నుండి మరొక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వినబడుతుంది.. అయితే  ఈ క్రేజీ ప్రాజెక్ట్ నార్త్ టు సౌత్ అన్ని రికార్డ్స్ లెక్కలు తేల్చే పొటెన్షియల్ కలిగి ఉందట.

ఇక ఈ మూవీలో హృతిక్, తారక్ మధ్య ఓ క్రేజీ డ్యాన్సింగ్ సాంగ్ ఉంటుందని.. అందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని డిజైన్స్ చేయిస్తున్నాడని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో రాబోయే సాంగ్ కే హైలెట్ కానుందని అంటున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే తారక్, హృతిక్ డ్యాన్స్ ఏ రేంజ్ లో ఇరగదీస్తారో చెప్పక్కర్లేదు. అలాంటి ఇద్దరి సూపర్ డ్యాన్సర్స్ మధ్య సాంగ్ పడితే ఇక బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 14న రిలీజ్ చేయనున్నారు. గతంలో రిలీజ్ అయిన ఫస్ట్ పార్ట్ వార్ చిత్రానికి ఇది సీక్వెల్.

మరింత సమాచారం తెలుసుకోండి: