టాలీవుడ్ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె చందమామ, మగధీర లాంటి బ్లాక్ బస్టర్ మూవీలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ స్థాయికి చేరుకుంది. తెలుగులో వరస క్రేజీ సినిమాలలో నటిస్తున్న సమయంలోనే ఈ బ్యూటీ తమిళ సినీ పరిశ్రమపై కూడా ఫోకస్ పెట్టి... అక్కడ కూడా చాలా సినిమాలలో నటించింది. ఈమె టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయంలోనే తన చిన్న నాటి స్నేహితుడు అయినటువంటి గౌతమ్ కిచ్లు  ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఆ తర్వాత కాజల్ ఓ పండంటి బిడ్డకు జన్మని కూడా ఇచ్చింది. పెళ్లి ఆ తర్వాత బిడ్డకు జన్మను ఇవ్వడం ఈ క్రమంలో ఈమె కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ కాజల్ వరుస సినిమాలలో నటిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈమె బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈమె ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈమె సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో కూడా నటిస్తోంది.

ఈమెకు సినిమా ఆఫర్లు వస్తున్నప్పటికీ మునపటి రేంజ్ లో మాత్రం వరస పెట్టి సినిమాలు రావడం లేదు. అయినప్పటికీ ఈమె కొన్ని విషయాల్లో అస్సలు తగ్గడం లేదు అని తెలుస్తుంది. పెళ్లికి ముందు అడపా దడపా రొమాంటిక్ సీన్లలో, బెడ్ సీన్లలో నటించి ప్రేక్షకులకు మంచి కేక్ ను ఎక్కించిన ఈ బ్యూటీ పెళ్లి తర్వాత మాత్రం అలాంటి సన్నివేశాలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

దానితో ఎవరైనా సినిమాలో లిప్ లాక్, రొమాంటిక్ సీన్స్, బెడ్ సీన్స్ ఉన్నాయి అని చెప్తే వెంటనే ఆ సినిమాను రిజెక్ట్ చేస్తుందట. కావాలి అంటే రెమ్యూనిరేషన్ తగ్గిస్తాను... కానీ అలాంటి సన్నివేశాల్లో నటించను అని దర్శక నిర్మాతలకు కాజల్ భారీ షాక్ ను ఇస్తుందట. అయినప్పటికీ కొంతమంది దర్శక నిర్మాతలు ఈమె పెట్టిన కండిషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కాజల్ నే సినిమాలో తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: