ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొంతకాలం క్రితం పుష్ప పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఈ మూవీ లోని తన నటనతో నేషనల్ అవార్డును కూడా దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించనుండగా... అనసూయ, సునీల్, రావు రమేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ అదిరిపోయే రేంజ్ న్యూస్ వైరల్ అవుతుంది.

ఈ సినిమాకు ఒక అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడితో వాయిస్ ఓవర్ ఇప్పించాలి అని ఈ మూవీ బృందం అనుకుంటున్నట్లు... అందులో భాగంగా పవన్ కళ్యాణ్ అయితే అందుకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు అని ఆలోచనలో ఈ చిత్ర బృందం ఉన్నట్లు ... మరికొన్ని రోజుల్లోనే ఈ విషయమై పుష్ప యూనిట్ పవన్ కళ్యాణ్ ను సంప్రదించబోతున్నట్లు అన్ని ఓకే అయితే పుష్ప మూవీ కి పవన్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఒక వేళ నిజంగానే పవన్ కనుక ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు అయితే ఈ మూవీ కి తెలుగులో మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా యొక్క ఫస్ట్ పార్ట్ సూపర్ సక్సెస్ కావడంతో రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa