అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  చిన్న వయసులోనే సిసింద్రీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం  అయ్యాడు. సిసింద్రీ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ తర్వాత అఖిల్ హీరోగా నటించిన ఏ ఒక్క సినిమా కూడా అంత పెద్ద విజయాన్ని అందుకోలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తప్పించి అఖిల్ నటించిన సినిమాలన్నీ కూడా నిర్మాతలకు నష్టాన్ని మిగిల్చాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

కగా ఇటీవల ఏజెంట్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన అఖిల్  సినిమాతో కూడా నిరాశపరచడం కలెక్షన్ పరంగా ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది అని చెప్పాలి. అయితే అఖిల్ తన నెక్స్ట్ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్లో ఒకటి తెరకెక్కుతుంది అన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈ సినిమాను అఖిల్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాకి ధీర అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేయాలి అని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా అఖిల్ కి సంబంధించిన ఒక లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . అఖిల్ గడ్డం పెంచి గుర్తు పట్టలేని విధంగా కనిపించడు.

 అయితే అఖిల్ చేస్తున్న నెక్స్ట్ మూవీ పిరియాడికల్ డ్రామా నేపథ్యంలో వస్తుంది అని అందుకే అఖిల్ తన లుక్ ను పూర్తిగా మార్చేసినట్లుగా తెలుస్తోంది. కెరీర్ పరంగా ఏడాది గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇకపై వేగంగా సినిమాల్లో నటించేలా ప్లాన్ చేసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. నాగార్జున సైతం అఖిల్ కెరీర్ పరంగా సక్సెస్ సాధించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. అక్కినేని అఖిల్ రెమ్యునరేషన్ విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారని లాభాల్లో వాటా తీసుకునేలా నిర్మాతలతో ఒప్పందాలు చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది. అక్కినేని అఖిల్ క్లాస్ ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అఖిల్ పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించబోతున్నారని కామెంట్లు వినిపిస్తుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: