నందమూరి కుటుంబం నుండి మూడవ తరం హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్  క్రియేట్ చేసుకున్నాడు. ఈ హీరోకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఇటీవల అర్ అర్ అర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ఎప్పుడు దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా కోసం సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలి అని ప్రయత్నిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

అయితే దాదాపుగా ఈ సినిమా కోసం రెండేళ్లుగా కష్టపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాపై ఫోకస్ చేశాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే తన తదుపరి సినిమాని  స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఆ సినిమా ముగిసిన వెంటనే మరొక డైరెక్టర్ తో సినిమా చేయాలి అని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ డైరెక్టర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శంకర్. ప్రస్తుతం శంకర్ గేమ్ చేంజెస్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అవ్వాలని భావిస్తున్నాడు శంకర్.

 ఇక అందులో భాగంగానే ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా తర్వాత ఆయన ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ ను కలిసి కథ కూడా చెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి వీళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కకబోయే సినిమా 2026వ సంవత్సరంలో సెట్స్ మీదికి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే శంకర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం దాదాపు వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ తీసుకుంటాడు.  కాబట్టి ఈ సినిమాకి కూడా అదే రేంజ్ లో టైమ్ తీసుకొని ఆ సినిమాను రూపొందించాలని చూస్తున్నాడు. ఇక దాంతో పాటుగా ఈలోపు ఎన్టీఆర్ కమిట్టైన సినిమాలు కూడా పూర్తి అయిపోతాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: