విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రెడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ 3, ఖుషి సినిమాల ఫలితాలు తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో సినిమా లైగర్ డబుల్ డిజాస్టర్ అయ్యి డిజాస్టర్ కా బాప్ అనిపించుకుంది. ఆ తర్వాత వచ్చిన ఖుషి సినిమా జస్ట్ ఓకే అనిపించుకున్నా కూడా బ్రేక్ ఈవెన్ కాలేకపోయి ప్లాప్ గా నిలిచింది.ఇక తన సినిమాల ఫలితాలతో తన పంథా మార్చాలని పూర్తిగా ఫిక్స్ అయ్యాడు విజయ్ దేవరకొండ. అందుకే తన నెక్స్ట్ సినిమాకు పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది.జెర్సీ డైరెక్టర్ గౌతం తిన్ననూరితో విజయ్ దేవరకొండ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను సూపర్ హిట్ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వారు నిర్మిస్తున్నారు. కెరీర్ లో రౌడీ విజయ్ దేవరకొండకు కావాల్సిన ఎమర్జెన్సీ హిట్ అందించేందుకు కృషి చేస్తున్నారు.ఇక విజయ్ దేవరకొండ కూడా గౌతం తిన్ననూరి సినిమా కోసం పూర్తి ఫోకస్ పెట్టేందుకు ఫుల్ గా రెడీ అవుతున్నాడట. సినిమాను ప్రేక్షకులు చూసేందుకు పలు జాగ్రత్తలు ప్రయత్నిస్తున్నాడట.


జెర్సీ సినిమాతో సౌత్ తో హిట్ అందుకొని  నార్త్ లో కూడా ప్లాప్ అందుకున్న గౌతం తిన్ననూరి విజయ్ తో చేస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా ఆడియన్స్ మెప్పించేలా చేస్తున్నాడట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని సమాచారం తెలుస్తుంది.ఇక అందులో ఒకరు మమితా బైజు కాగా.. మరొకరి రవి తేజ మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ అని సమాచారం తెలుస్తుంది. ఈమె నాని సినిమాలో కూడా నటిస్తుంది.ఈసారి ఆడియన్స్ అంచనాలను అందుకునేందుకు ఎలాంటి రిస్క్ అయినా చేసేందుకు రెడీ అంటున్నాడు విజయ్. తన సినిమాలు ఏమాత్రం బాగాలేకపోయినా ఒక రేంజ్ లో నెగిటివిటీ వస్తుండగా తనపై అనవసరమైన రాద్ధాంతం చేస్తున్న వారికి కూడా సాలిడ్ ఆన్సర్ ఇచ్చేందుకు విజయ్ సిద్ధం అవుతున్నాడు. టాలీవుడ్ యంగ్ హీరోల్లో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న విజయ్ దేవరకొండ సరైన సినిమాతో వస్తే ఖచ్చితంగా అద్భుతాలు చేసే ఛాన్స్ ఉంది. కానీ దాదాపు ఆరేళ్ల నుంచి విజయ్ కు లక్ కలిసి రావట్లేదు. అందుకే గౌతం తిన్ననూరి కాంబో సినిమాతో భారీ టార్గెట్ నే పెట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: