టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు చరణ్. మెగాపవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.ఇక ఇప్పుడు ఆయనకు గౌరవ డాక్టరేట్‌ కూడా దక్కింది. ఏప్రిల్ 13న చెన్నైలోని యూనివర్శిటీ ఆఫ్ వేల్స్‌లో జరిగే కార్యక్రమంలో రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నారు. దాంతో ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోతున్నారు. అభిమానులు, కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే అభిమానులు ఆయనను 'డాక్టర్ రామ్ చరణ్' అని పిలవడం ప్రారంభించారు కూడా. .

రామ్ చరణ్ 2007లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఎన్నో సూపర్ హిట్ ల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు చరణ్. అలాగే ఎన్నో అవార్డులు అందుకున్నాడు. 'నంది అవార్డు', ఫిలింఫేర్, సైమా వంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు. 'RRR' లో అతని నటనకు 'క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు'కి నామినేట్ అయ్యాడు. ఇక ఇప్పుడు గౌరవ డాక్టరేట్ ను అనుకోనున్నాడు. అభిమానులు, సినీ ప్రముఖులతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రామ్ చరణ్ ను అభినందించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు.

రామ్ చరణ్ కు డాక్టరేట్ దక్కడం చాలా సంతోషంగా ఉంది. డాక్టరేట్ స్పూర్తితో చరణ్ విజయవంతమైన లు చేయాలనీ. అవార్డులు అందుకోవాలని కోరుకుంటున్నా అని లేఖలో రాశారు పవన్. రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' లో నటిస్తున్నాడు. శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో సాగుతుంది. ఈ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ నటిస్తోంది. 'గేమ్ ఛేంజర్' షూటింగ్ ప్రస్తుతం మైసూరులోజరుగుతోంది. ఈ తర్వాత బుచ్చిబాబుతో చేస్తున్నారు. ఆతర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ చేస్తున్నాడు చరణ్ .

మరింత సమాచారం తెలుసుకోండి: