పెళ్లిచూపులు సినిమా తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ.ఈయన చేసిన సినిమా మంచి విజయాన్ని అందుకుంది.అయితే విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో చాలా రకాల కామెంట్లు చేస్తూ విమర్శలను ఎదుర్కొంటున్నాడు ఎందుకంటే ఆయనకి ఇప్పటికి చాలా కాంట్రవర్శి లు చేసి చాలామందిని గెలికాడు.అందువల్లే ఆయనని ఇండస్ట్రీలో ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ మరి కొంతమంది వాళ్ల కామెంట్లనైతే తెలియజేస్తున్నారు.ఇక ఇది ఇలా ఉంటే ఫిదా సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న హీరోయిన్ సాయిపల్లవి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.

ఇక తెలుగులో ఒక హీరోకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారో ప్రస్తుతం సాయి పల్లవికి కూడా అలాంటి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. కాబట్టి తను తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వం లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలో మొదట సాయి పల్లవి హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆమె ఆ సినిమాని రిజెక్ట్ చేసింది.

ఇక ఇదిలా ఉంటే శివ నిర్వానా డైరెక్షన్ లో వచ్చిన ఖుషి సినిమాలో కూడా సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలనే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అప్పుడు కూడా ఆ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేసింది.   ఇక మొత్తానికైతే ఆమె విజయ్ దేవరకొండ నటించిన సినిమాల్లో తను చేయను అని చెబుతున్నటుగా తెలుస్తుంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ సినిమాలు అంటే కాంట్రవర్శ లను కలిగిస్తూ ఉంటాయి. ఇక దానికి తోడు గా ఆయన సినిమాల్లో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆయన సినిమాలకు దూరంగా ఉండటం మంచిదని ఆమె ఒక నిర్ణయం తీసుకొని వాటి నుంచి దూరంగా ఉంటూ ఆమె కి నచ్చిన సినిమాలు చేసుకుంటు ముందుకెళ్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: