మలయాళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి పృధ్వీరాజ్ సుకుమారన్ తాజాగా ది గోట్ లైఫ్ (ఆడు జీవితం) అనే వైవిధ్యమైన సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి.

ఇలా ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కుతూ ఉండడంతో తాజాగా ఈ మూవీ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూపొందిన ఓ బ్లాక్ బాస్టర్ మూవీ యొక్క లైఫ్ టైమ్ కలెక్షన్ లను క్రాస్ చేసింది. అసలు విషయం లోకి వెళితే ... మోహన్ లాల్  కొన్ని సంవత్సరాల క్రితం మన్యం పులి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ఆ సమయంలో అద్భుతమైన కలక్షన్ లను వసూలు చేసి మాలివుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ఆ టైమ్ లో 128 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలవగా ... ఆ తర్వాత ఈ సినిమాను పలు మూవీ లు బీట్ చేశాయి.

ఇకపోతే తాజాగా ఆడు జీవితం సినిమా కూడా ఈ సినిమా యొక్క లైఫ్ టైం కలెక్షన్ లను క్రాస్ చేసింది. తాజాగా ఆడు జీవితం మూవీ 130 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసి మన్యం పులి సినిమా కలెక్షన్ లను క్రాస్ చేసింది. ఇక ఇప్పటికి కూడా ఆడు జీవితం మూవీ కి డీసెంట్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. దానితో ఈ మూవీ మరికొన్ని రోజుల పాటు మంచి కలెక్షన్ లను రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా కలెక్షన్ ల విషయాన్ని కాసేపు పక్కన పెడితే ... ఇందులో పృథ్వీరాజ్ నటనకు మాత్రం ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ps