మాస్ మహారాజా రవితేజ కొంత కాలం క్రితం ఈగల్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. కావ్య దాపర్ , అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటించగా ... నవదీప్మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించాడు. మొదట ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది.

కానీ ఆ తర్వాత ఇదే సీజన్ లో అనేక సినిమాల విడుదల ఉండడంతో ఈ మూవీ విడుదలను వాయిదా వేసి ఆ తర్వాత సోలోగా విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఈటీవీ విన్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకే సారి అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో అలరించింది. ఇకపోతే ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది.

సినిమా యొక్క శాటిలైట్ హక్కులను ఈ టీవీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా మరికొన్ని రోజుల్లోనే ఈ సంస్థ వారు ఈ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ , హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: