బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో షారుక్ ఖాన్ ఒకరు. ఈయన సినిమాలలో నటించడానికి ఎంతో మంది నటీనటులు ఎంతో ఉత్సాహపడుతూ ఉంటారు. అలాంటి వారిలో ప్రియమణి కూడా ఒకరు. గతంలో అనేక సార్లు ప్రియమణి , షారుక్ ఖాన్ తో నటించడం అంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది. తాజాగా ఈమె మైదాన్ అనే సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా ఈమె మాట్లాడుతూ ... షారుక్ ఖాన్ ఫోన్ చేసి సినిమాలో నటిస్తావా అని అడుగుతే ఎంత పెద్ద ఆఫర్ ఉన్న దానిని వదులు కొని షారుక్ సినిమాలో నటిస్తాను అని చెప్పుకొచ్చింది.

ఇకపోతే గతం లోనే ఈ బ్యూటీ షారుక్ ఖాన్ హీరో గా రూపొందిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. అలాగే ఇందులోని ఐటమ్ సాంగ్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ వచ్చిన చాలా కాలం తర్వాత షారుక్ ఖాన్ హీరో గా రూపొందిన జవాన్ మూవీ లో ప్రియమణి ఓ కీలకమైన పాత్రలో నటించింది. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నయన తార , దీపికా పదుకొనే హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్ల గొట్టి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇలా ఇప్పటి వరకు షారుక్ ఖాన్ హీరో గా రూపొందిన రెండు సినిమాలలో ప్రియమణి నటించగా ఆ రెండు మూవీ లు కూడా అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ మరో సారి కూడా షారుక్ తో నటించడానికి రెడీ అని చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఈ బ్యూటీ షారుక్ తో నటించిన రెండు మూవీ లు సూపర్ సక్సెస్ కావడంతో ఈమెకు షారుక్ తో నటించే అవకాశం మళ్ళీ వచ్చిన పెద్ద ఆశ్చర్యం పోవడం అవసరం లేదు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: