సూపర్ స్టార్ రజనీ కాంత్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇంతటి క్రేజ్ కలిగిన ఈ నటుడికి రెమ్యూనరేషన్ కూడా భారీ మొత్తంలోనే అందుతూ ఉంటుంది. ఇక ఇన్ని రోజుల పాటు ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటుడు అని తలపతి విజయ్ నీ చెబుతూ వచ్చారు. ఈయన ఒక్కో మూవీ కి దాదాపు 230 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇదే ఇండియాలో ఆల్ టైం హైయెస్ట్ రెమ్యూనరేషన్ అని వార్తలు కూడా వచ్చాయి.

ఇకపోతే ప్రస్తుతం విజయ్ కంటే ఎక్కువ రెమ్యూనిరేషన్ తీసుకునే హీరో సూపర్ స్టార్ రజినీ కాంత్ అంటూ ఓ వార్త స్ప్రెడ్ అవుతుంది. రజనీ కాంత్ ఒక్కో మూవీ కి దాదాపుగా 280 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు ఇండియాలో ఈ స్థాయి పారితోషకం వేరే ఏ హీరో తీసుకోవడం లేదు అని రజినీ నే ఇండియాలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న ఇండియన్ హీరోగా నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు అనే వార్త ఒకటి వైరల్ అవుతుంది. గతంలోనే రజినీ "అన్నాత్తే" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

మూవీ కి రజిని 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక జైలర్ మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రజిని ప్రస్తుతం ఒక్కో మూవీ కి 280 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే రజినీ ప్రస్తుతం టీ జే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లోను ... లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లోను హీరో గా నటిస్తున్నాడు. ఈ రెండు మూవీ లపై కూడా ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: