కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రీ మారన్ ఆఖరుగా "విడుదల పార్ట్ 1" అనే మూవీ కి దర్శకత్వం వహించాడు . ఈ మూవీ లో తమిళ సినీ పరిశ్రమలో కమెడియన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న సూరి ప్రధాన పాత్రలో నటించగా... విజయ్ సేతుపతిమూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు . ఇక ప్రస్తుతం వేట్రి మారన్ "విడుదల పార్ట్ 2" మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.

ఇకపోతే గతంలోనే వెట్రీ మారన్ , సూర్య తో వాడివాసల్ అనే మూవీ ని తెరకెక్కించ బోతున్నట్లు అనౌన్స్ చేశాడు. ఈ అనౌన్స్మెంట్ వచ్చి చాలా కాలమే అవుతున్న ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు. దానితో వీరిద్దరి కాంబోలో వాడివాసల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అనే ఆసక్తి జనాల్లో నెలకొంది. ఇకపోతే తాజాగా వేట్రీ మారన్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... ప్రస్తుతం "విడుదల పార్ట్ 2" సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీ కి సంబంధించిన పనులు అన్ని పూర్తి కాగానే సూర్య తో వాడివాసల్ మూవీ ఉంటుంది అని తెలియజేశాడు.

ఇలా ఈ దర్శకుడు అప్డేట్ ఇవ్వడంతో సూర్య అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య, శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ కంగువా లో హీరోగా నటిస్తున్నాడు. దిశా పటానీ ఈ మూవీ లో సూర్య కి జోడిగా నటిస్తోంది. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులతో పాటు ఇండియా వ్యాప్తంగా మూవీ లవర్స్ మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే సూర్యకు ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు లభించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: