సూపర్ స్టార్ రజనీ కాంత్ పోయిన సంవత్సరం జైలర్ అనే మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ భారీ కలెక్షన్ లను వసూలు చేసి కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ లో రజనీ కాంత్ కు భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించగా ... మిల్కీ బ్యూటీ తమన్న ఈ మూవీలో ఓ స్పెషల్ పాత్రలో నటించింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు.

అనిరుద్ అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. జైలర్ మూవీ సూపర్ సక్సెస్ కావడంతోనే ఈ మూవీ కి కొనసాగింపుగా మరో మూవీ ఉండబోతుంది అని మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక తాజాగా జైలర్ మూవీ సీక్వెల్ కథ పనులు పూర్తి అయినట్లు కోలీవుడ్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ మొత్తం పూర్తి కావడంతో ఇప్పటికే ఈ సెవ్వెల్ కి ఓ క్రేజీ టైటిల్ ను కూడా ఈ మూవీ బృందం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

జైలర్ సినిమాలో "హుకుం" అనే సాంగ్ అదిరిపోయే రేంజ్ లో ఫేమస్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. దానితో జైలర్ సీక్వెల్ కి "హుకుం" అనే టైటిల్ అయితేనే అదిరిపోయే రేంజ్ లో సెట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ మూవీ బృందం ఇదే టైటిల్ ఆల్మోస్ట్ ఈ సినిమాకు కన్ఫర్మ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీ కాంత్, టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలోను, లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలోను నటిస్తున్నాడు. ఈ సినిమాలకు సంబంధించిన పనులు పూర్తి కాగానే జైలర్ సీక్వెల్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: