సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఇక హీరో హీరోయిన్లకు సంబంధించి ఏదో ఒక విషయం ఇంటర్నెట్లో ఎప్పుడు వైరల్ గా మారిపోతు ఉంటుంది. ఇక ఎవరైనా సెలబ్రిటీ ఏదైనా విషయం పై కామెంట్ చేశారు అంటే చాలు.. అది ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ అందరీ దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నోరా ఫతేహి చేసిన కామెంట్స్ సంచలనంగా మారిపోయాయి. బాలీవుడ్ లో ఇటీవల కాలంలో జరుగుతున్న లవ్ మ్యారేజ్ లు, అరేంజ్డ్ మ్యారేజ్ ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ హీరోయిన్. ఎన్నో ఏళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన సెలబ్రిటీ జంటలు చివరికి పెళ్లితో ఒకటవుతున్నాయ్. ఈ పెళ్లిలను ఉద్దేశిస్తూ నోరా ఫతేహి కామెంట్స్ చేసింది. కేవలం డబ్బు ఫేమ్ కోసమే ఇలా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు అంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టింది. దీంతో ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి చేసిన కామెంట్స్ కాస్త అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బాలీవుడ్ హీరోయిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలామంది డబ్బు ఫేమ్ కోసమే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు అంటూ కామెంట్ చేసింది. ఏకంగా ప్రేమించినట్లు నటించి డబ్బు పేరు కోసం వారు ఎంతగానో తాపత్రయపడుతున్నారు. చివరికి దీని కోసమే ఏళ్ల తరబడి వారితోనే జీవిస్తూ ఇక జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.  వారి కెరియర్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. చివరికి వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసుకొని డిప్రెషన్ లోనే బ్రతికేస్తున్నారు. వారు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు అంటూ హీరోయిన్ నోరా ఫతేహి చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. అయితే గత కొంతకాలం నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీల ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువైపోయాయి. ఇలాంటి సెలబ్రిటీ పెళ్లిళ్ల వెనుక ఉన్న అసలు నిజం ఇది అంటూ ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: