బస్ కండక్టర్ స్థాయి నుంచి స్వయంకృషితో ఏకంగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ ఇక ఇప్పుడు 73 ఏళ్ల వయసులో కూడా యువ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే మొన్నటి వరకు వరుస ప్లాపులతో సతమతమైన రజనీకాంత్ జైలర్ అనే సినిమాతో ఒక సాలిడ్ హిట్ కొట్టి కమ్ బ్యాక్ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించగా మోహన్లాల్, శివరాజ్ కుమార్ లు కీలకపాత్రలో కనిపించారు. ఇక ఈ మూవీలో రజనీకాంత్ తనదైన మార్క్ యాక్షన్ తో అభిమానులందరికీ కూడా ఫుల్ మీల్స్ పెట్టేసాడు. ఇకపోతే ప్రస్తుతం లోకేష్ కనకరాజు తో ఒక మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.  అయితే ఇక ఇప్పుడు రజనీకి సాలిడ్ కం బ్యాక్ ఇచ్చిన జైలర్ సినిమాకు సీక్వెల్  రాబోతుంది అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది  అంతేకాదు ఇక ఈ సీక్వల్ సినిమాకు ఒక పవర్ఫుల్ టైటిల్ పెట్టారట. ఈ క్రమంలోనే జైలర్ సినిమా సీక్వెల్ మూవీ కి హుకుం అనే టైటిల్ ఖరారు చేశారట.


 ఇక ఈ టైటిల్.. సీక్వెల్ ఫై భారీ రేంజ్ లోనే అంచనాలు పెంచుతుంది. అయితే ఈ ఏడాది చివరి నాటికి కూడా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభించబోతున్నారట. దీంతో ఈ విషయం తెలిసి ఫాన్స్ అందరు కూడా తెగ ఆనందపడిపోతున్నారు  రజినీకి మరో సాలిడ్ హిట్ రెడీ అవుతుంది అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ తో చేస్తున్న మూవీకి వెట్టాయ్యన్ తెలుగులో వేటగాడు అనే మూవీ టైటిల్ పెట్టగా.. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: