తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా కొనసాగుతున్న చిరంజీవి.. కెరియర్ లో 150 కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. ఇక ఎన్నో ఎవర్ గ్రీన్ సినిమాలు కూడా ఉన్నాయి అని చెప్పాలి. ఇలా చిరంజీవి కెరీర్ లో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయే సినిమాలలో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కూడా ఒకటి. 1990 మే 9వ తేదీన విడుదలైన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ మూవీ.. ఒక రకంగా ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా టీవీలలో వచ్చిన కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు. అయితే ఈ మూవీలో చిరంజీవి సరసన అతిలోకసుందరి శ్రీదేవి హీరోయిన్గా నటించింది. ఇక వీరిద్దరి జోడీకి కుదిరిన కెమిస్ట్రీకి అభిమానులు అందరూ కూడా ఫిదా అయిపోయారు. ఈ ఒక్క సినిమాతోనే శ్రీదేవి, చిరంజీవి జోడి ప్రేక్షకులకు ఫేవరెట్ జోడిగా మారింది. అయితే ఇలా తన కెరియర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా కొనసాగుతున్న జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు సీక్వెల్ వస్తే చూడాలని ఉంది అంటూ ఇటీవల చిరంజీవి తన మనసులో మాట బయటపెట్టాడు. ప్రస్తుతం చిరంజీవి వారసుడు రామ్ చరణ్, శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా సీక్వల్ లో నటిస్తే చూడాలని ఉంది అంటూ మెగాస్టార్ అన్నారు.త్వరలోనే ఆ కళ నెరవేరలని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ మాట్లాడుతూ.. చరన్ తో జాన్వి కపూర్ ఒక సినిమా చేస్తుంది. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు శ్రీదేవి గుర్తొచ్చి భావోద్వేగానికి గురయ్యాను. ఇండస్ట్రీ ఒక మంచి నటిని కోల్పోయింది అంటూ చిరంజీవి పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: