సిద్దు జొన్నలగడ్డ టిల్లు సిరీస్ లో భాగంగా వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ మూవీ ఏకంగా 100 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది.ఒక్క నైజాం, యూ ఎస్ కలిపి ఏకంగా 60 కోట్లు వసూలు చెయ్యడం విశేషం.ఇప్పటికీ కూడా డీసెంట్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో రన్ అవుతోంది. స్టార్ బాయ్ ఇమేజ్ ని అయితే సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాతో మరింత పెంచుకున్నాడు. అలాగే మంచి సాలిడ్ మార్కెట్ ని కూడా క్రియేట్ చేసుకున్నాడు.ఈ టిల్లు సిరీస్ కి ముందు కనీసం 10 కోట్ల బడ్జెట్ హీరోగా కూడా లేని సిద్దు జొన్నలగడ్డ టిల్లు సక్సెస్ తో ఏకంగా 30 నుంచి 40 కోట్ల బడ్జెట్ లెవల్ కి తన మార్కెట్ ని పెంచుకోగలిగాడు. ఎక్కువగా ప్రయోగాలు చేయకుండా ట్రెండ్ కి కనెక్ట్ అయ్యే  కథలని ఎంచుకుంటూ న్యాచురాలిటీకి దగ్గరగా ఉండేలా ప్రెజెంట్ చేస్తూ ఉండటంతో సిద్దు చేస్తోన్న మూవీస్ కి ఆడియన్స్ బాగా ఎట్రాక్ట్ అవుతున్నారు.డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ లలో కథలు ఇంచుమించు ఒకే లాగా ఉన్న కూడా సిద్దు చేసిన టిల్లు క్యారెక్టరైజేషన్, సింగిల్ లైనర్ కామెడీ డైలాగ్స్, అంతకుమించి యూత్ కి చాలా బాగా కనెక్ట్ అయ్యాయి.


ఇంకా అలాగే ఈ జెనరేషన్ లవ్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ కారణంగా రెండు సినిమాలు సూపర్ హిట్ కేటగిరీలో చేరాయి. ఇప్పుడు టిల్లు క్యారెక్టర్ ని మరింతగా కొనసాగించాలని నిర్మాత నాగ వంశీ, హీరో సిద్దు బాగా డిసైడ్ అయ్యారు. పార్ట్ 3కి టిల్లు క్యూబ్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. అయితే ఈ మూవీ రిలీజ్ కావడానికి టైం పడుతుందని సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ అనే సినిమాని చేస్తున్నాడు. అలాగే నీరజ కోన దర్శకత్వంలో తెలుసు కదా అనే మరో సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు. ఈ రెండు సినిమాల తర్వాత టిల్లు క్యూబ్ సినిమా స్టార్ట్ కావొచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే ఒకే రకమైన కథలతో సినిమా చేసేటపుడు కచ్చితంగా ఎక్కువ గ్యాప్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సిద్ధూ చాలా తెలివిగా గ్యాప్ తీసుకొని కెరీర్ ప్లాన్ చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: