శివ జ్యోతి అదేనండి మన తీన్మార్ సావిత్రి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. వి6 లో ప్రసారమయ్యే తీన్మార్ వార్తల్లో సావిత్రిగా అందరికీ పరిచయమైన ఆమె.. తెలంగాణ యాసలో గలగల మాట్లాడేస్తూ బుల్లితెర ప్రేక్షకుల హృదయాలకు బాగా దగ్గరయింది. చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా తీన్మార్ వార్తలుకు బాగా కనెక్ట్ అయ్యారు అంటే దానికి కారణం సావిత్రినే అని చెప్పాలి. ఇక ఇప్పుడు తీన్మార్ వార్తలు నుంచి తప్పుకున్నప్పటికీ బిగ్ బాస్ ద్వారా మాత్రం మరింత గుర్తింపును అందుకుంది శివ జ్యోతి.


 తన ఆటతీరుతో తన వ్యక్తిత్వంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇక బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత బిజీ బిజీ అవుతుంది. ప్రస్తుతం ఒకవైపు న్యూస్ రీడర్ గా రాణిస్తూనే.. ఇంకొన్ని వైపు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటుంది.  మరోవైపు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ సందడి చేస్తోంది శివ జ్యోతి. ఈమె యూట్యూబ్ ఛానల్ కి ఏకంగా వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉండడం గమనార్హం. అయితే ఇంస్టాగ్రామ్ లో కూడా ఎన్నో వీడియోలను చేస్తూ ఉంటుంది ఈమె. అయితే ఇటీవల శివ జ్యోతి చేసిన ఒక వీడియో వైరల్ గా మారిపోయింది.


 ఈ వీడియోలో శివ జ్యోతి చూపించిన ఒక విషయాన్ని చూసి ఆమె భర్త గంగులీ చాలా కాస్లీ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. వీడియోలో భాగంగా శివ జ్యోతి నైట్ టైం తన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకొని వాటిని ఓపెన్ చేస్తూ ఉంటుంది. అంతలోనే అక్కడికి ఆమె భర్త గంగూలి వస్తారు. అయితే ఇవి ఏంటి అని ఆయన అడగడంతో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అంటూ చెబుతుంది శివ జ్యోతి. అయితే వాటి ధర చెప్పిన తర్వాత.. నైట్ రొటీన్ కోసం ఇంత వేళలో ఖర్చు చేయడం అవసరమా అంటూ గంగూలి అంటాడు. దీంతో అవునా నీ నైట్ రొటీన్ ఏంటో చూపిస్తా ఆగు అంటూ పక్కనే ఉన్న కబోర్డ్ ఓపెన్ చేస్తుంది. అందులో పెద్ద ఎత్తున మందు బాటిల్స్ కనిపిస్తాయి. వాటిలో  బాటిల్ ధర 8 వేల రూపాయల నుంచి 4000 రూపాయల వరకు ఉన్నాయి. దీంతో ఇంత కాస్లీ మందు తాగుతున్నాడు అంటే గంగూలి కూడా చాలా కాస్లీ అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: