కన్నడ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి యాష్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈ నటుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జీ ఎఫ్ చాప్టర్ 1 , కే జీ ఎఫ్ చాప్టర్  2 సినిమాలలో హీరోగా నటించాడు. ఈ రెండు మూవీ లు కూడా ఇండియా వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించడంతో ఒక్క సారిగా యాష్ కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు ఏర్పడింది.

ఇకపోతే "కే జి ఎఫ్ చాప్టర్ 2" సినిమా పూర్తి అయిన వెంటనే యాష్ అనేక సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఈయన మాత్రం సినిమాలను సెలెక్ట్ చేసుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే ఈయన "కే జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ తర్వాత ఏ సినిమా షూటింగ్ ను కూడా ఇప్పటి వరకు ప్రారంభించలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా యాష్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజాగా కన్నడ స్టార్ హీరో యాష్ మాట్లాడుతూ ... భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై ఉంచాలన్నది నాకు ఎప్పటి నుంచో ఉన్న కల. నిర్మాత నమిత్ మల్హోత్రా తో కలిసి రామాయణం తీస్తే బాగుంటుందని చాలా సార్లు అనుకున్నాం. కానీ అంత పెద్ద సబ్జెక్టు మూవీ తీయడం మామూలు విషయం కాదు. పైగా బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. అందుకే నితీష్ దర్శకత్వంలో రామాయణం సినిమాకు కో ప్రొడ్యూస్ చేస్తున్న. దీని కోసం ఎంతైనా కష్టపడతా అని యాష్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే తాజాగా రామాయణం సినిమా గురించి ఎంతైనా కష్టపడతా అని యాష్ చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: