మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గామి” ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా 'గామి' మూవీ తెరకెక్కింది.విభిన్నమైన స్టోరీ మరియు నేరేషన్‍తో దర్శకుడు విద్యాధర్ కాగిత ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్చి 8న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ గామి అదరగొడుతోంది. నేషనల్ వైడ్‍ గా గామి మూవీ ట్రెండ్ అవుతోంది.గామి సినిమా ఏప్రిల్ 12వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం మరియు కన్నడ డబ్బింగ్ వెర్షన్‍లలో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వచ్చింది. మంచి హైప్ ఉన్న ఈ చిత్రం ఓటీటీలో కూడా దూసుకెళుతోంది. మంచి వ్యూస్ దక్కించుకుంటోంది.గామి సినిమా ప్రస్తుతం జీ5 ఓటీటీలో ఇండియాలోనే టాప్ ట్రెండింగ్‍లో నిలిచింది. హనుమాన్ చిత్రం జీ5లో సుమారు 28 రోజులుగా టాప్‍లో ట్రెండ్ అవుతుండగా.. ఇప్పుడు గామి ఫస్ట్ ప్లేస్‍కు వచ్చింది.

గామి సినిమాకు ఓటీటీలో కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఓటీటీలో ఈ చిత్రాన్ని చూసిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ మూవీలోని విజువల్స్ అలాగే విశ్వక్‍సేన్ యాక్టింగ్‍ కి ఫిదా అయ్యారు.. ఈ మూవీ నేరేషన్‍ను కూడా ప్రశంసిస్తూ వరుసగా పోస్టులు పెడుతున్నారు. థియేటర్లలో సూపర్ హిట్ అయిన గామి మూవీ జీ5 ఓటీటీలో కూడా దూసుకెళుతోంది.గామి సినిమాలో విశ్వక్‍సేన్ శంకర్ అనే అఘోరగా నటించారు. మనిషి స్పర్శతో తనకు ఉన్న ఇబ్బందిని పోగొట్టుకునేందుకు హిమాలయాల్లోని మాలికా పత్రాల కోసం చేసే అతను చేసే సాహస వంతమైన ప్రయాణమే ప్రధాన అంశంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీలో చాందినీ చౌదరి, అభినయ, మహమ్మద్ సమాద్, హారికా పెద్ది, దయానంద్ రెడ్డి మరియు శాంతి రావు ముఖ్య పాత్రలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: