టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ.. ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదల అయిన ఈ సినిమా త్రిబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఇక ఈ సినిమాతో నిర్మాతలు భారీ లాభాలు సాధించారు.సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి..తేజ సజ్జ ఇమేజ్ ని ఈ సినిమా అమాంతం పెంచేసింది.హనుమాన్ సినిమాతో తేజా సజ్జా ఇప్పటివరకు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోలు కూడా టచ్ చేయలేని 300 కోట్ల వసూళ్ళని టచ్ చేశాడు. ఒక చిన్న హీరో ఈ రేంజ్ హిట్ కొట్టడం అంటే అసలు మామూలు విషయం కాదు.దీంతో ఈ యంగ్ హీరో తాను చేయబోయే తదుపరి సినిమాలు ఆ ఇమేజ్ కి తగ్గట్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా ఈ క్రమంలోనే ఓ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేశాడు.మంచు మనోజ్ విలన్ గా తేజ సజ్జ ఈ సినిమా చేయబోతున్నారు.


అంతేకాదు, ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఓ ముఖ్య పాత్ర చేసి గెస్ట్ అపిరెన్స్ కూడా ఇవ్వబోతున్నారట.ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి రీసెంట్ గా రవితేజతో ‘ఈగల్’ వంటి సూపర్ స్టైలిష్ ఫిలిం తెరకెక్కించిన కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. తేజ సజ్జ తన నెక్స్ట్ మూవీ కార్తీక్ ఘట్టమనేనితో చేస్తున్నారు. సూర్య వెర్సస్ సూర్య, ఈగల్ వంటి డిఫరెంట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కార్తీక్ ఘట్టమనేని ఇప్పుడు తేజ సజ్జతో ఇంకెలాంటి మూవీ తెరకెక్కించబోతున్నారో అని అందరిలో ఆసక్తి నెలకుంది.పైగా ఆ ఆసక్తికి ఇప్పుడు మంచు మనోజ్, దుల్కర్ సల్మాన్ కాస్టింగ్ యాడ్ అవ్వడంతో.. ఈ మూవీ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మరి తేజ సజ్జ, కార్తీక్ ఘట్టమనేని స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తారో చూడాలి. కాగా ఈ ప్రాజెక్ట్ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీగా నిర్మించబోతోంది. మరి చూడాలి హనుమాన్ సినిమాతో 300 కోట్ల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తేజా సజ్జా ఇక కార్తిక్ ఘట్టమనేని సినిమాతో కూడా ఆ రేంజ్ వసూళ్ళని సాధిస్తాడో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి: