బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అలాంటి వారిలో శ్రీ సత్య కూడా ఒకరు. ఈ బ్యూటీ బిగ్ బాస్ షో తో ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన కష్టాలను ఆటతీరు అందాన్ని చూసి శ్రీ సత్యకు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో ఆమెని టాప్ ఫైవ్ వరకు తీసుకువచ్చారు. అయితే బిగ్ బాస్ లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ బిగ్బాస్ తర్వాత పలు బుల్లితెర కార్యక్రమాలలో బిజీ అయింది. పలు శోలు డాన్స్ చేస్తూ మరికన్ని షోలో ఎంటర్టైన్ చేస్తూ బిజీగా ఉంది. అయితే గతంలో ఒకసారి శ్రీ సత్య కి ఎంగేజ్మెంట్ అయి బ్రేకప్

 అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి మధ్య కొన్ని గొడవలు కొన్ని కలహాలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. ఇక తన జీవితంలో జరిగిన ఇంతటి బాధాకరమైన విషయాన్ని శ్రీ సత్య బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు ప్రతిసారీ ఈ విషయాన్ని చెప్పి బాధపడుతూ ఉండేది. ఈ నేపథ్యంలోనే తన సెకండ్ లవ్ గురించి కూడా బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ బ్యూటీ బాయ్ ఫ్రెండ్ మరెవరో కాదు పవన్ రవీంద్ర. ఇందులో భాగంగానే ఆమె తన బాయ్ ఫ్రెండ్ కూడా ధరించానని చెప్పడంతో ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంతేకాదు వీరిద్దరూ ఎప్పటినుండో ప్రేమలో ఉన్నారు అని చాలామంది బుల్లితెర సీరియల్ నటులు సైతం చాలా సార్లు తెలియజేస్తూ వచ్చారు. వీరు కలిసి ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే వీరిద్దరూ ఒక ఈవెంట్లో.. కలుసుకున్నారని.. అప్పటినుంచి ఈ జంట ప్రేమలో ఉన్నారని రివిల్ చేయడం జరిగింది. అయితే శ్రీ సత్య తను లైఫ్ లో ఎన్నో స్ట్రగుల్స్ ని మరియు బాధలని కష్టాలని ఎదుర్కొని ఇప్పుడు పవన్ రవీంద్రత తో ప్రేమలో ఉందని త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది.  ఈ ఫోటోలు చూసిన వారంతా..” మేము ఇప్పటివరకు నీకు లవ్ ఫెయిల్యూర్ అయిందని అనుకున్నాము. కానీ నువ్వు మళ్ళీ లవ్ లో పడ్డావని మాకు తెలీదు. ఏదేమైనా చూస్తూ చూస్తూనే మమ్మల్ని బురిడీ కొట్టించావుగా.  అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: