మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజాగా డాక్టరేట్ అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ ను అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే నిన్న జరిగిన యూనివర్సిటీ ఉత్సవాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి డాక్టరేట్ ను అందించారు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు సీతారాం. అయితే రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీకి అందించిన సేవలకి గాను ఈ గౌరవాన్ని అందించినట్లుగా ఈ సందర్భంగా ఆయన తెలియజేసాడు. అయితే ఈ సందర్భంగా రామ్ చరణ్ కి అభిమానులతో 

పాటు సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాదు వాటికి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే మెగా పవర్ స్టార్ రాంచరణ్ మాట్లాడుతూ.. వేల్స్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకోవడం ఎప్పటికీ మరచిపోలేని మధుర క్షణం అంటూ వెల్లడించాడు .దాంతోపాటు మెగా అభిమానులకి సైతం ఒక గుడ్ న్యూస్ను అందించాడు. ప్రస్తుతం తాను నటిస్తున్న గేమ్ ఛేంజర్ పొలిటికల్ యాక్షన్ మూవీ అని.. అలాగే ఆ ను సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో 

ఐదు పాన్ ఇండియన్ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇన్నాళ్లు అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు మెగా పవర్ స్టార్ రాంచరణ్  గేమ్ ఛేంజర్ రిలీజ్ పై స్పష్టత ఇచ్చేశారు మెగా పవర్ స్టార్ రాంచరణ్  .ఇక ఈ మూవీ పక్కా విడుదల తేదీ మాత్రమే అనౌన్స్ చేయాల్సి ఉందంటున్నారు ఫ్యాన్స్. ఇటీవలే మెగా పవర్ స్టార్ రాంచరణ్   బర్త్ డే సందర్భంగా విడుదలైన జరగండి జరగండి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: