రొటీన్ సినిమాలతో విసుగత్తిపోయి మంచి థ్రిల్లింగ్ మూవీ కావాలనుకునేవారికి 'బహుముఖం' సినిమా రీసెంట్ టైంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ అనే చెప్పాలి. సినిమా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా ఈ మూవీలో థ్రిల్లింగ్ అంశాలు చాలా బాగున్నాయి.  ప్రేక్షకులకు ఈ సినిమా చాలా కొత్తగా అనిపిస్తుంది. థ్రిల్లింగ్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా ప్రస్తుతం బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఈ సినిమాలో నటించిన హీరో హర్షివ్ కార్తీక్ చాలా బాగా ఆకట్టుకున్నాడు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకుంటూ మరో పక్క ఈ సినిమాని తీసాడు. పైగా ఈ సినిమాకి అతనే రచయిత, హీరో, దర్శకుడు, నిర్మాత కావడం విశేషం. సినిమాని చాలా డిఫరెంట్ గా తీసి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా మొత్తం అమెరికాలోనే షూటింగ్ చేశారు. అక్కడ ఉన్న ఇండియన్స్, అమెరికా నటీనటులతో సినిమాని తెరకెక్కించారు. సినిమా కథ కంటే కూడా స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు చాలా బాగా రాసుకున్నారు. 
హీరో కమ్ రైటర్ హర్షివ్ కార్తీక్ సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించాడు. ఓ పక్క నటుడు అవ్వాలనే తపనతో, మరో పక్క సైకోగా నటించి అదరగొట్టాడు.  హీరోయిన్ స్వర్ణిమ సింగ్ కూడా పర్వాలేదనిపించింది. అమెరికన్ నటి మరియా మార్టినోవా అయితే బాగా మెప్పిస్తుంది. ఇక మిగిలిన నటీనటులంతా తమ నటనతో పర్వాలేదు అనిపించారు.బహుముఖం సినిమా చాలా రిచ్ గా ఉంది. ఈ మూవీకి సినిమాటోగ్రఫీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యాయి. 
అమెరికన్ సినిమాటోగ్రాఫర్ ల్యూక్ ఫ్లెచర్ విజువల్స్ చాలా ఆకట్టుకున్నాయి. శ్రీ చరణ్ పాకాల ఎప్పటిలాగే థ్రిల్లింగ్ సినిమాలకి మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాడని ఈ మూవీతో నిరూపించాడు. ఈ సినిమాకి కూడా తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టాడు. హర్షివ్ కార్తీక్ యాక్టర్ గా దర్శకుడిగా, నిర్మాతగా మంచి సినిమా తీశారు.ఈ సినిమాకి నిశ్శందేహంగా 3/5 రేటింగ్ ఇవ్వొచ్చు. మొత్తానికి రొటీన్ సినిమాలతో విసుగెత్తి పోయిన వారు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా థ్రిల్ అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: