కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బీస్ట్, వారిసు, లియో లాంటి మూడు వరుస ప్లాపుల తరువాత కూడా మంచి ఊపు మీద ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం'. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకడైన వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో జేజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.తలపతి విజయ్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సెప్టెంబర్‌ 5న విడుదల తేదీ ప్రకటించిన మేకర్స్‌ తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ను కూడా విడుదల చేయడం జరిగింది.తలపతి విజయ్‌ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమా తర్వాత 'దళపతి 69' ప్రాజెక్ట్ మాత్రమే చేయనున్నాడు. ఆ తరువాత రాజకీయాల్లో ఫుల్ గా బిజీ కానున్నాడు. 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమాలో విజయ్‌ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. 


ఈ సినిమాకి కోలీవుడ్ టాప్ కంపోజర్ లలో ఒకడైన యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తే.. తాజాగా విడుదలైన పాటను విజయ్‌తో పాటు వెంకట్‌ ప్రభు పాడటం కూడా జరిగింది. పాన్ ఇండియా టాప్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఈ పాటకి కొరియోగ్రఫీ అందించారు.ఇక పలు సినిమాల్లో విజయ్‌ పాటలు కూడా పాడుతూ ఉంటాడు. ఇప్పటి దాకా ఇళయరాజా, ఏఆర్‌ రెహమాన్‌, హరీష్‌ జయరాజ్‌, అనిరుధ్‌, విద్యాసాగర్, థమన్ వంటి ప్రముఖ సంగీత దర్శకుల మ్యూజిక్‌ డైరెక్షన్‌లో పాట పాడగా అవన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. ఇక తాజాగా యువన్‌ శంకర్‌ రాజా సంగీత దర్శకత్వంలో ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం సినిమా కోసం చివరగా విజయ్‌ ఒక పాటను పాడడం విశేషం. కొన్ని రోజుల పాటు తమిళనాట ఈ సాంగ్‌ ఒక ఊపు ఊపేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా విడుదలైన ఈ పాట చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఎప్పటిలాగే విజయ్ అభిమానులు ఈ పాటకి రికార్డ్ స్థాయిలో లైక్స్ కొట్టేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: