ప్రస్తుతం ఉన్న హీరోలందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు పాన్ ఇండియా సినిమాల హవా సైతం పెరిగిపోతుంది. ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో అప్పటినుండి స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా సినిమా లు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓ జి సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే దానికి సంబంధించిన షూటింగ్లో భాగంగా విలన్ గా ఇమ్రాన్ హస్మీను తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇక బాలీవుడ్ లో ఈ సినిమా మంచిగా ఆడాలి అన్న ఉద్దేశంతోనే ఆయనను ఈ సినిమాలో తీసుకున్నట్లుగా అయితే వార్తలు వినబడుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే సెప్టెంబర్ 27వ తేదీ వరకు ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇంకా 40% చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీ ఎలక్షన్స్ పనిలో బిజీగా ఉన్నాడు.

 కాబట్టి పవన్ కళ్యాణ్ రాజకీయాల నుండి ఫ్రీ అవ్వడానికి కచ్చితంగా మరొక రెండు నెలలు పడుతుంది. మిగతా రెండు నెలల గ్యాప్ లో పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ఎన్ని డేట్లు కేటాయిస్తాడు ఎలా షూట్ జరుగుతుందనేది కూడా ఇప్పుడు అందరిలో ఆసక్తి ని అయితే నెలకొల్పుతుంది. అందుకే ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ఈ విషయాన్ని అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఈ సినిమా కనక ఒకవేళ రిలీజ్ పోస్ట్ పోన్ అయితే మరొక నెల తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: