మెగాస్టార్ చిరంజీవి అనగానే అందరికీ మొదట గుర్తుకు వచ్చేది ఆయన వేసే స్టెప్పులు. టాలీవుడ్ లో  డాన్స్ కి  ట్రెండ్ సెట్ చేసింది చిరంజీవి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన చేసే స్టెప్పులు ఆయన గ్రేస్ చూస్తే ఖచ్చితంగా మారిపోతుంది. అయితే చిరంజీవికి ఇంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి ముఖ్యాంశం ఆయన డాన్స్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక డ్యాన్స్ లో మెగాస్టార్ చిరంజీవి కి పోటీగా ఇప్పటివరకు ఏ హీరో రాలేదు అని చెప్పొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రాకతో ఇప్పుడిప్పుడు మెగాస్టార్ చిరంజీవికి డాన్స్ పరంగా గట్టి పోటీ ఎదురయ్యింది.

 అయినప్పటికీ చిరంజీవి డాన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ ఒక గొప్ప డాన్సర్. ఇకపోతే చిరంజీవి నటించిన సినిమాల్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ఇంద్ర. 2002లో విడుదలైన ఈ సినిమా బి గోపాల్ దర్శకత్వంలో వచ్చింది. అశ్విని దత్త ఈ సినిమాను నిర్మించారు. మణిశర్మ అందించిన పాటలు ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఇందులోని ప్రతి ఒక్క పాట కూడా ఇప్పటికీ అందరూ వింటూనే ఉంటారు. ఇక అలాంటి పాటల్లో దాయి దాయి దామ్మా అనే పాట అందరి ఫేవరెట్.

అయితే ఈ పాటకి లారెన్స్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాటలో చిరంజీవి వేసిన వీణ స్టెప్ విపరీతంగా పాప్యులర్ అయ్యింది. కాగా అల్లు అర్జున్ ఈ స్టెప్ విషయంలో ఓ పందెం వేశాడట. ఇంద్ర విడుదలైన కొత్తలో ఆ సినిమా గురించి మాట్లాడుతూ స్నేహితుడితో బెట్ కట్టాడట. దాయి దాయి దామ్మా సాంగ్ లో వీణ స్టెప్ వేసేటప్పుడు పక్కనే సోనాలి బింద్రే ఉంటుందని అల్లు అర్జున్ స్నేహితుడు అన్నాడట. లేదు ఇంద్ర నేను 17 సార్లు చూశాను. అది సోలో స్టెప్ చిరంజీవి మాత్రమే ఉంటారని అల్లు అర్జున్ అన్నాడట. ఇద్దరూ రూ. 25 వేలకు బెట్ కట్టారట. తీరా సాంగ్ చూస్తే వీణ స్టెప్ లో చిరంజీవి పక్కన సోనాలి బింద్రే ఉందట. దాంతో అల్లు అర్జున్ డబ్బులు కోల్పోయాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: