పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. అయితే ఈ కాంబినేషన్ లో వచ్చిన చత్రపతి బాహుబలి 1 బాహుబలి 2 సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్లు గా నిలిచి నిర్మాతలకి లాభాలను అందించాయి. అయితే ఒక సందర్భంలో స్టార్ హీరో ప్రభాస్ ను రాజమౌళి ఇమిటేట్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో పాతదే అయినప్పటికీ ఈ వీడియోను చూసేందుకు ప్రభాస్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. అయితే చత్రపతి సినిమా ప్రమోషన్స్ లో ఒక ఘటన జరిగింది. అది ఏంటంటే..

చత్రపతి సినిమా షూటింగ్ సమయంలో గ్యాప్ తీసుకుని పార్టీ చేసుకుందాము అని ప్రభాస్ చెప్పాడు. ప్రభాస్ చెప్పినట్లుగానే రాజమౌళి సైతం ఆ పార్టీకి డీప్ ఫిక్స్ చేసినట్లుగా ఒకానొక సందర్భంలో తెలిపారు. అయితే వారు అనుకున్న డేట్ కి కూడా షూట్ ఉండడంతో ఆ సమయంలో ప్రభాస్ చాలా ఫీల్ అయ్యాడు అని రాజమౌళి చెప్పాడు. ఇక ఆ సమయంలో ప్రభాస్ తన కోపాన్ని ఏ విధంగా చూపించాలో తెలియక ఏయ్ సింతల్ ఎంత సేపయ్య ఎన్నాళ్ళు అయ్యా.. అన్నాడు అని రాజమౌళి ప్రభాస్ ను ఇమిటేట్ చేసాడు.

అయితే అలా రాజమౌళి ప్రభాస్ ను ఇమిటేట్ చేయడంతో ఆ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమౌళి టాలెంట్ చూసిన నెటిజన్లు జక్కన్న నటనపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు కానీ పెట్టి ఉంటే నటుడిగా కూడా ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యేవాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాహుబలి3 ఎప్పుడు తీస్తారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. రాజమౌళి ప్రస్తుతం మహేష్ సినిమాతో బిజీగా ఉన్నారు.  ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకే జక్కన్న చాలా సమయం కేటాయించారు. రాజమౌళిసినిమా షూటింగ్ అయినా వేగంగా పూర్తి చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: