టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన. అయితే రష్మిక మందన సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో ఒకరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగులో పుష్ప  సినిమాతో మరింత క్రేజీ సంపాదించుకుంది ఈ బ్యూటీ. అయితే ప్రస్తుతం టు సినిమాతో బిజీగా ఉంది ఈ సినిమాతో పాటు ఇతర భాషల్లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. చాలా తక్కువ సమయంలోనే హీరోయిన్గా భారి విజయాన్ని తెచ్చుకుంది. ఇందులో భాగంగానే తాజాగా రష్మిక మందన ఇంత త్వరగా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి..

తన సక్సెస్ స్టోరీ ఏంటి అన్న విషయాలను వెల్లడించింది. ఇందులో భాగంగానే రష్మిక మందన మాట్లాడుతూ.. తనకంటే చాలా అద్భుతంగా యాక్టింగ్ చేసే వాళ్ళు ప్రతిభ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని వెల్లడించింది. అయితే రష్మిక  కి మంచి సినిమాల్లో ఆఫర్లు రావడం వల్ల నే రష్మిక మందన చాలా సులువుగా సక్సెస్ అవ్వగలిగాను అని.. అందుకే నాకు సక్సెస్ అవ్వడం చాలా సులువుగా మారింది అని పేర్కొంది. అంతేకాదు ఈ విషయంలో తన నిజంగానే చాలా కృతజ్ఞత రాలినై ఉంటాను అని చెప్పుకొచ్చింది.

జీవితంలో సంతోషాన్ని పొందిన సక్సెస్ను సులువుగా తీసుకోవద్దు అని వెల్లడించింది. అంతేకాదు చాలా కాలంగా రష్మిక మందన నేర్చుకుంటుంది ఇదేనని చెప్పుకొచ్చింది. దీంతో రష్మిక మందన చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక చేసిన కామెంట్లు నిజమేనని నెటిజన్లు చెబుతున్నారు. ఎంతోమంది హీరోయిన్ గా సక్సెస్ కావాలని ప్రయత్నించినా వేర్వేరు కారణాల వల్ల సక్సెస్ కాలేకపోతున్నారు. రష్మికకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండటంతో భాషతో సంబంధం లేకుండా ఆఫర్లు వస్తున్నాయి. ఇతర హీరోయిన్లతో పోలిస్తే రష్మిక రెమ్యునరేషన్ ఎక్కువ మొత్తం అని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ లో  నా రోల్ మరింత బలంగా ఉంటుందని ఆమె తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: