మెప్పించగలను అని ప్రూఫ్ చేసింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించి ఈ విషయాన్ని అందరికీ తెలియజేసింది. ఇక పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్రతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు త్వరలోనే పుష్ప 2 సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా పుష్ప మించి ఉండబోతోంది అని అంటుంది రష్మిక మందన. అయితే రష్మిక మందన తాజాగా మాట్లాడుతూ పుష్ప టూ లో రష్మిక 2.0 ని చూస్తారు అంటూ వెల్లడించింది.

అయితే తాజాగా ఇటీవల ఒక మీడియాతో ముచ్చటించిన రష్మిక మందన పుష్ప టు సినిమాకి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించింది. అందులో భాగంగానే తన పాత్ర ఎలా ఉండబోతోంది అన్న విషయాలను కూడా చెప్పుకొచ్చింది. ఇక అల్లు అర్జున్ కి జోడిగా ఈ సినిమాలో రష్మికను చూసి ఫ్యాన్స్ అందరూ తెగ సంబరపడుతున్నారు. చాలా అమాయకంగా అందంగా గడిసరిగా పుష్పా సినిమాలో తన యాక్టింగ్ తో అదరగొట్టేసింది శ్రీవల్లి. అయితే మొదటగా పుష్ప సినిమా గురించి తన దగ్గర మాట్లాడినప్పుడు సినిమాలో తన పాత్ర గురించి ప్రస్తావించినప్పుడు మొదట తనకి అస్సలు అర్థం కాలేదట.

 కనీసం తనకి అవగాహన కూడా లేదు అని శ్రీవల్లి పాత్ర ఎలా ఉంటుందో కూడా ఊహించలేకపోయాను అని ఈ సందర్భంగా తెలియజేసింది రష్మిక మందన. దాంతోపాటు ఈ పాత్రతో తను ఎలాంటి ప్రపంచాన్ని సృష్టిస్తుందో అన్నది కూడా ఊహించలేను అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సెట్లో అడుగు పెట్టినప్పుడు ఖాళీ మైదానంలో తిరుగుతున్నట్లు అనిపించేదట. అయితే ఇప్పుడు అలా కాదని, ఆ పాత్ర గురించి పూర్తిగా తెలుసని, అందుకే శ్రీవల్లి పాత్ర కోసం కసరత్తులు చేస్తున్నాను. అలాగే మొదటి భాగంలో కంటే రెండో భాగంలో తన పాత్ర బలంగా ఉంటుందని, అందుకే శ్రీవల్లి 2.0 చూస్తారు అని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: