సాధారణంగా కొంతమంది ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతూ ఉంటారు. ఇక అలాంటి వారిలో ఎక్కువగా హీరోలు ఉంటారు. ఉదాహరణకి ఒక సినిమా శుక్రవారం విడుదల అయింది అంటే చాలు మరుసటి రోజు శనివారం వాళ్ళు స్టార్స్ అయిపోతూ ఉంటారు. అయితే అది వారికి మొదటి సినిమా అవ్వక్కర్లేదు. ఇలా హీరోలకి జరుగుతూ ఉంటుంది. కానీ హీరోయిన్లకి ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు రావడం అన్నది చాలా తక్కువ. అయితే ఇప్పుడు మాత్రం అలాంటి ఒక స్టార్డం అందుకొని ఎంజాయ్ చేస్తోంది తృప్తి.

అలానే ఈమె నటించిన సినిమాలో హీరోయిన్గా కనిపించిందా అంటే అది కూడా లేదు.  రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాలో కనిపించింది. అందులో తన నటన గ్లామర్ అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో ఆమె నెక్స్ట్ సినిమా చేసే సినిమాలన్నీ కూడా స్టార్ హీరోలతోనే ఉన్నాయి. అయితే అనుకున్నట్లుగానే ఆమె స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తనకి సంబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా వార్ టు సినిమాలో తృప్తి ఒక కీలక పాత్రలో

 కనిపించబోతోంది అన్న వార్తలు గత కొంతకాలంగా వైరల్ అవుతున్నాయి. హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లు వస్తున్న బాలీవుడ్ సినిమా తోనే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సైతం షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కు సంబంధించిన ఒక యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో యానిమల్ బ్యూటీ సైతం ఉంది అని తెలుస్తోంది.  దర్శకుడు అయాన్‌ ముఖర్జీ ఇటీవల ఆమెను సంప్రదించారని సమాచారం. యశ్‌రాజ్‌ బ్యానర్‌లో అవకాశం అందులోనూ స్టార్‌ హీరోల సినిమా అనేసరికి ఆమె కూడా ఓకే అంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: