పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడైతే బాహుబలి సినిమా చేశాడో అప్పటినుండి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్న ప్రభాస్ ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక అప్పటి నుండి తిరుగులేని హీరోగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే ఉన్నాయి. అలా ఆయన నుండి వస్తున్న పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ తన సినిమాలతో గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. ఇక ఆయన సినిమాల కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ప్రభాస్ అభిమానులు. అంతలా ఆయన ప్రేక్షకుల నుండి ఆదరణను పొందారు. అయితే గత సంవత్సరం సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. ఇక ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే సలార్ తో భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్ ఈ సంవత్సరం కల్కి రాజా సాబ్ అనే రెండు పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే హను రాఘవపూడి డైరెక్షన్ లో మరొక సినిమాకి కమిట్ అయిన ప్రభాస్ ఈ సినిమాని తొందరలోనే సెట్స్ మీద కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో ప్రభాస్ ఫాదర్ క్యారెక్టర్ లో మలయాళ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు పొందిన మమ్ముట్టి ని తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.  అయితే ఈ క్యారెక్టర్ లో ఆయన్ని ఎందుకు తీసుకున్నారు అంటే, ఆ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ అంట. ఆ క్యారెక్టర్ కి బ్యాక్ స్టోరీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందట. అందువల్లే డైరెక్టర్ మమ్ముట్టి అయితేనే దానికి బాగా సెట్ అవుతాడనే ఉద్దేశ్యంతో మమ్ముట్టి ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది.  ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లాలంటే మరో సంవత్సరం ఈజీగా పడుతుంది. కాబట్టి ఈలోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని హను రాఘవపూడి పూర్తి చేయాలనే ఉద్దేశ్యం తో ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: