సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ఇక తమకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్  సంపాదించుకునే హీరోలు కొంతమంది ఉంటారు. అలాంటి వారిలో నేటి జనరేషన్ కి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంటర్ ఇచ్చిన రౌడీ హీరో.. తన నటనతోనే కాదు తన యాటిట్యూడ్ తో కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఒక రకంగా అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అని నిరూపించి యూత్ ఐకాన్ గా కూడా మారిపోయాడు.


 విజయ్ దేవరకొండ హీరోగా నటించే సినిమాలు యూత్ ను ఎంతలా ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇలా విజయ్ దేవరకొండ కి ఇండస్ట్రీలో వచ్చిన ప్రత్యేకమైన క్రేజ్ దృష్ట్యా ఎంతో మంది హీరోయిన్లు కూడా అతనితో ఒక్క సినిమా చేసిన చాలు అని కోరుకున్నారు. బాలీవుడ్ భామలు కూడా ఇలా రౌడీ హీరో అంటే పడి చచ్చిపోయేవారు. ఇప్పటికీ కూడా విజయ్ దేవరకొండ తో ఒక్క సినిమా చేసే ఛాన్స్ వస్తే బాగుండు అని ఎంతో మంది కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం ఒకవేళ రౌడీ హీరోతో నటించే ఛాన్స్ వస్తే తప్పకుండా రిజెక్ట్ చేస్తాను అంటూ చెప్పింది. ఆమె ఎవరో కాదు త్రిష.


 ఈ విషయం కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. విజయ్ దేవరకొండ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నిలిచిన మూవీస్ లో గీతగోవిందం  సినిమా కూడా ఒకటి. అయితే ఈ మూవీలో నిత్యామీనన్ స్పెషల్ క్యామియో రోల్ లో కనిపించింది. అయితే మొదట ఈ పాత్ర కోసం త్రిషని అప్రోచ్ అయ్యారట మేకర్స్. కానీ త్రిష మాత్రం ఎలాంటి చిన్నచితకా పాత్రల్లో కనిపించను అంటూ మొఖం మీద చెప్పేసిందట. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే రిజెక్ట్ చేస్తాను అంటూ తెలిపిందట. ఆ తర్వాత కూడా విజయ్ దేవరకొండ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాలు వచ్చిన త్రిష రౌడీ హీరోతో నటించేందుకు  పెద్దగా ఆసక్తి చూపించలేదట. ఇక ఈ న్యూస్ తెలిసి రౌడీ హీరో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: