టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయినటువంటి సైన్ధవ్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

అలా సంధవ్ మూవీ తో ప్రేక్షకులను నిరాశ పరిచిన వెంకటేష్ తన తదుపరి మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి తో చేయబోతున్నాడు. గతం లోనే వీరి కాంబోలో ఎఫ్ 2 , ఎఫ్ 3 అనే రెండు మూవీ లు రూపొందడం ... ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో వీరి కాంబో లో పొందుతున్న మూడవ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా ఓ క్రేజీ బ్యూటీని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో వెంకటేష్ కి జోడిగా మీనాక్షి చౌదరిని ఈ మూవీ మేకర్స్ సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా తాజాగా ఈ మూవీ దర్శకుడు అనిల్ రావిపూడిబ్యూటీ ని కలిసి మూవీ కథను మొత్తం వినిపించగా ... ఈమె కూడా ఆ కథ విని వెంటనే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా ఈ మూవీ యూనిట్ మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయబోతున్నట్లు వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: