బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి అక్షయ్ కుమార్ హీరో గా , టైగర్ ష్రాఫ్ , పృథ్వీరాజ్ సుకుమారన్‌ , సోనాక్షి సిన్హా , మానుషి చిల్లర్ , అలాయా ఎఫ్ కీలక పాత్రల్లో "బడే మియా చోటే మియా"  అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి జూలియస్ పాకియం నేపథ్య సంగీతం అందించారు. 

జాకీ భగ్నానీ , వషు భగ్నానీ , దీప్సికా దేశ్‌ముఖ్ , అలీ అబ్బాస్ జాఫర్ , హిమాన్షు కిషన్ మెహ్రా ఈ మూవీ ని నిర్మించారు.  ఈ సినిమా ఏప్రిల్ 11 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే కాస్త నెగటివ్ టాక్ ను తెచ్చుకున్న ఈ సినిమా ప్రస్తుతం భారీ మొత్తంలో కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టడంలో పెద్దగా సక్సెస్ కాలేక పోతుంది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది.

అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లో వచ్చిన కలెక్షన్ లకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ను విడుదల చేసింది. ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో 76.01 కోట్ల క్రాస్ కలెక్షన్ లు దక్కినట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే 3 రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ లను బట్టి చూస్తే ఈ మూవీ భారీ మొత్తంలో కలక్షన్ వసూలు చేయడం కాస్త కష్టం గానే కనపడుతుంది. మరి ఈ మూవీ లాంగ్ రన్ లో ఏ స్థాయి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: