టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. 2025 జనవరి 10వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది. ఇక విశ్వంభర సినిమా తరువాత మెగాస్టార్ తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తారన్న సస్పెన్స్ చాలా నెలలుగా ఉంది.అయితే ఓ వైపు విశ్వంభర షూటింగ్ జరుగుతుండగానే.. చిరు మరో మూవీ స్టార్ట్ చేస్తారని అప్పట్లో వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు. తన దృష్టంతా కేవలం విశ్వంభర పైనే పెట్టారు మెగాస్టార్. టాలీవుడ్ కు చెందిన సుమారు 10 మంది డైరెక్టర్లు మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీసేందుకు పోటీ పడుతున్నట్లు టాక్ వినిపించింది. తాజాగా చిరు తదుపరి సినిమాకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో బాగా ఫుల్ వైరల్ అవుతూ బాగా కిక్ ఇస్తుంది.స్టార్ డైరెక్టర్  హరీష్ శంకర్ తో మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా దాదాపు ఫిక్స్ అయినట్లు సినీ వర్గాల్లో సమాచారం వినిపిస్తోంది. ఎప్పటి నుంచి ఈ కాంబోపై ఎన్నో వార్తలు వస్తున్నా.. ఇప్పుడు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం తెలుస్తుంది. పైగా ఈ ప్రాజెక్టుకు బీవీఎస్ రవి స్టోరీ అందిస్తున్నారట.


స్క్రిప్ట్ పై పూర్తి వర్క్ చేసి చిరు వినిపించమన్నారని తెలుస్తోంది. దీంతో హరీష్ తన ఫోకస్ అంతా కథపై పెట్టారట. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుందని సమాచారం తెలుస్తుంది.మరోవైపు, హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాలు తీస్తున్నాడు. ఉస్తాద్ షూటింగ్ కు పవన్ కళ్యాణ్ వల్ల బ్రేక్ పడటంతో మిస్టర్ బచ్చన్ ను పూర్తి చేస్తున్నారు హరీష్. మళ్లీ ఎన్నికల తర్వాత పవన్ ఉస్తాద్ సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టనున్నారు. ఇక చిరు మరికొద్ది రోజుల్లో ఫ్రీ అవ్వనున్నారు. దీంతో 2024 లో చిరు- హరీష్ శంకర్ సినిమా స్టార్ట్ అవ్వనున్నట్లు సమాచారం. హరీష్ శంకర్ మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలందరికి హిట్లు ఇచ్చాడు. పవన్ కి గబ్బర్ సింగ్, అల్లు అర్జున్ కి డీజే, సాయి తేజ్ కి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, వరుణ్ తేజ్ కి గద్దల కొండ గణేష్ వంటి సినిమాలు ఇచ్చాడు. ఇప్పుడు చిరుకి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: