నేషనల్ క్రష్ రాష్మీక మందన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈమె కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా రష్మిక మాట్లాడుతూ ... తనకంటే అద్భుతమైన అందం మరియు టాలెంట్ కలిగిన ఎంతో మంది అమ్మాయిలు సినీ పరిశ్రమలో ఉన్నారు. తనకు మంచి అవకాశాలు రావడం ... అలాగే నేను నటించిన సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో నేను ప్రస్తుతం సినీ పరిశ్రమలో మంచి స్థాయికి చేరుకున్నాను అని తాజా ఇంటర్వ్యూ లో బాగంగా చెప్పుకొచ్చింది.

ఇలా రష్మిక వరుస విజయాలతో అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఏ మాత్రం గర్వం లేకుండా ... తనకు అదృష్టం కలిసి వచ్చింది. అందుకే నేను నటించిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అందుకే నేను ఈ స్థానంలో ఉన్నాను. నా కంటే టాలెంట్ , అందం ఉన్న అమ్మాయిలు ఎంతో మంది ఇండస్ట్రీ లో ఉన్నారు.అని ఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది. రష్మిక ఇంత గొప్ప వ్యక్తిత్వంతో మాట్లాడడంతో ఈమె తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.
\
ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ అనేక సినిమాలలో నటిస్తోంది. ఇక ప్రస్తుతం రష్మిక నటిస్తున్న సినిమాలలో "పుష్ప పార్ట్ 2" మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందుతున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు ఈ సినిమాను ఎంతో భారీ బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే రష్మిక క్రేజ్ మరింత పెరిగే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: